స్టార్ డైరెక్టర్ శంకర్ తదుపరి ప్రాజెక్ట్‌పై కొత్త అప్‌డేట్ వచ్చింది. ‘ఇండియన్ 2’ విడుదల కోసం ఎదురుచూస్తున్న ఆయన, ‘ఇండియన్ 3’ పై ఇప్పట్లో స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో శంకర్ తన తదుపరి సినిమా ‘వేల్పూరి’ నవల ఆధారంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్.
తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, శంకర్ ఈ ప్రాజెక్ట్‌కు అజిత్ కుమార్‌ను హీరోగా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అజిత్ విదేశాల్లో ఉండటంతో, ఈ చర్చలు అతను తిరిగి వచ్చిన తర్వాతే స్పష్టతకు వస్తాయని చెబుతున్నారు.
ఇటీవల అజిత్ నటించిన ‘పట్టుదల’ నిరాశపరిచింది. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా విజయం ఆయన భవిష్యత్తు ప్రాజెక్ట్స్‌పై ప్రభావం చూపనుంది.
శంకర్ మళ్లీ స్టార్ హీరోతో చేయాలా? లేక యంగ్ హీరోతో సినిమాను ప్లాన్ చేయాలా? అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక సమాచారం రావొచ్చని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.