fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsశర్వా తో సెట్ అయిన 'మహా సముద్రం'

శర్వా తో సెట్ అయిన ‘మహా సముద్రం’

Sharwanand LatestMovie MahasamudramAnnounced

టాలీవుడ్: RX100 సినిమా ద్వారా పరిచయం అయ్యి సూపర్ హిట్ పొందిన డైరెక్టర్ ‘అజయ్ భూపతి’. రెండు సంవత్సరాలు అయినా కూడా ఈ డైరెక్టర్ నుండి ఏ కొత్త సినిమా ప్రకటన రాలేదు. కానీ ఈ రెండు సంవత్సరాలుగా ఈ డైరెక్టర్ ‘మహా సముద్రం’ అనే స్క్రిప్ట్ తో చాలా మంది హీరోలని కలిసాడు అని టాక్. మొన్నటి వారికి నాగ చైతన్య చేయబోతున్నాడు అని విపించింది కానీ చైతూ లైన్ అప్ బిజీ గా ఉండడం తో చివరకి శర్వా కి ఈ సినిమా సెట్ అయింది. ఈరోజే సైలెంట్ గా ఈ సినిమా ప్రకటించారు ప్రొడ్యూసర్స్. ఇదో డీప్ ఇంటెన్స్ లవ్ స్టోరితో కూడుకున్న యాక్షన్ డ్రామా అని చిత్రబృందం చెబుతోంది.

ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రామబ్రహ్మం సుంకర సమర్పిస్తున్నారు. తెలుగు-తమిళ ద్విభాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. ప్రస్తానం, గమ్యం లాంటి చిత్రాల ద్వారా కెరీర్ ఆరంభం లోనే ఇంటెన్స్ పాత్రలు చాలా బాగా డీల్ చేయగలిగాడు శర్వానంద్. ఆ తర్వాత ఆ రేంజ్ పాత్రలు రానప్పటికీ కెరీర్ కి అయితే డోకా లేదు. కానీ గత 3 – 4 సినిమాలు వరుసగా ఆకట్టుకోక పోవడం తో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు శర్వా. చూడాలి ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీ అయినా శర్వా కి కలిసొస్తుందో లేదో. కానీ ఇండస్ట్రీ లో డైరెక్టర్స్ కి రెండవ సినిమా విఘ్నం దాటి ఈ డైరెక్టర్ తనని తాను ఎంతవరకు నిరూపించుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular