టాలీవుడ్: యాక్షన్ సినిమా అయినా, ఫామిలీ సినిమా అయినా, డాన్ క్యారెక్టర్ అయినా, బాయ్ నెక్స్ట్ డోర్ కారెక్టర్ అయినా ఏదైనా ఆ పాత్రలో ఇమిడిపోయి తన నటనతో మెప్పించగల నటుడు శర్వానంద్. శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’ అనే సినిమా మహా శివరాత్రి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా టాక్ ఎలా ఉందొ చూద్దాం.
కథ విషయానికి వస్తే చిన్నప్పటినుండే వ్యవసాయం చేయాలి అనుకున్న హీరో ఇంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సిటీ లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ తన తండ్రికి సహకరిస్తూ ఉంటాడు. తన కుటుంబానికి చెందిన అప్పు తీరగానే తాను అనుకున్న వ్యవసాయం వైపు అడుగులు వేస్తాడు. ఇలాంటి సమయం లో తనని అందరూ వద్దని వారించినా కూడా తనకున్న విజన్ తో తన ఇంటరెస్ట్ వైపు అడుగులు వేస్తాడు. అంతే కాకుండా తన గమ్యం కోసం తనని ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకోవాల్సి వస్తుంది . హీరోకి తన ఇష్టం వైపు ఉన్న నిజాయితీ నే ఈ సినిమా మొత్తం కనిపించింది. వూర్లో నష్టాలు వచ్చి వ్యవసాయం చెయ్యలేక ఊరొదిలి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో వ్యవసాయం చేయడానికి వచ్చిన శర్వానంద్ తాను అనుకున్న గమ్యాన్ని ఎలా సాధించాడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. కథ విషయానికి వస్తే ఊహించిన కథే కనిపిస్తున్నా కూడా మనసుకి హత్తుకొనే సన్నివేశాలతో భావోద్వేగాల్ని నింపడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
నటీ నటుల విషయానికి వస్తే శర్వా మరోసారి ఈ సినిమా ద్వారా తన పరిణతిని చూపించాడు. ప్రతీ సీన్ లో శర్వా సెట్టిల్డ్ యాక్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సబ్జెక్టులో శర్వా ని మొదటి ఫ్రేమ్ నుండే ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయగలుతుతాడు అంటే అర్ధం చేసుకోవచ్చు శర్వా ఎలా నటించాడో. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కూడా అల్లరి పిల్ల లాగా బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే హీరోయిన్ అంటే కేవలం పాటల కోసం వచ్చి వెళ్లినట్టు కాకుండా సినిమా మొత్తం హీరోకి తోడుగానే ఉంటుంది. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరొక ముఖ్య పాత్ర రావు రమేష్. కేవలం రావు రమేష్ మాత్రమే ఇలా చెయ్యగలడు అనేంతగా చేసాడు రావు రమేష్. భయస్తుడిగా ఉండే తండ్రి పాత్రలో రావు రమేష్ ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించాడు. మరిన్ని పాత్రల్లో సాయికుమార్, ప్రభాస్ శ్రీను, నరేష్, సప్తగిరి, సత్య, ఆమని, మురళి శర్మ తమ తమ పాత్రల వరకు మెప్పించారు.
టెక్నిషియన్స్ లో డెబ్యూ డైరెక్టర్ కిశోరె రెడ్డి తనకి వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని ఒక మంచి సినిమాని ప్రెసెంట్ చేసాడు. తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని ఎక్కడ అనవసర కామెడీ అని, కమర్షియల్ ఎలెమెంట్స్ అని, విలన్ తో ఫైట్స్ లాంటివాటితో పక్కదోవ పట్టించకుండా ఒక నిజాయితీగా చేసిన ప్రయత్నమే ఈ సినిమా. హీరో తాను చేయాలనుకున్న పని కోసం ఎంత తపన పడుతుంటాడో తనని ప్రేమించిన అమ్మాయి హీరో కోసం ఏదైనా చేయాలనుకొనే అంతర్లీన ప్రేమని కూడా ఇందులో చూపించగలిగాడు డైరెక్టర్. హీరోయిన్లు పాటల కోసమే అన్నట్టు కాకుండా హీరో హీరోయిన్ల మధ్య బాండింగ్ ని పెద్ద పెద్ద డైలోగ్స్ తో, ఎమోషనల్ సీన్స్తో కాకుండా సింపుల్ గా ఆకట్టుకునేలా చూపించాడు. ఈ సినిమాకి మరో పెద్ద అసెట్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్. ఉన్నవి కొన్ని పాటలే అయినా వస్తానంటివో, శ్రీకారం టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాని మరో మెట్టు ఎక్కించాడు మిక్కీ. యువరాజ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. పచ్చని పొలాల మధ్య కనిపించే సీన్స్ అన్ని చాలా అద్భుతంగా చూపించాడు యువరాజ్. సినిమా నిర్మాణ విలువలు ఎక్కడ తగ్గకుండా నిర్మించింది 14 ప్లస్ టీం.
ఒక్క మాటలో చెప్పాలంటే “ఒక కొత్త ప్రారంభానికి శ్రీకారం“