fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsఒక ప్రశ్నతో కొత్త ఒరవడికి 'శ్రీకారం'

ఒక ప్రశ్నతో కొత్త ఒరవడికి ‘శ్రీకారం’

Sharwanand SreekaramMovie TeaserReleased

టాలీవుడ్: టాలీవుడ్ విలక్షణ నటుడు ‘శర్వానంద్‘ ప్రస్తుతం ‘శ్రీకారం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఒక రైతు పాత్రలో ఈ సినిమాలో శర్వా నటిస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమా టీజర్ విడుదలైంది. ‘ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు, ఒక డాక్టర్ కొడుకు ఒక డాక్టర్ అవుతున్నాడు, ఒక బిజినెస్ మాన్ కొడుకు బిజినెస్ మాన్ అవుతున్నాడు … కానీ ఒక రైతు కొడుకు రైతు ఎందుకు అవలేకపోతున్నాడు???. ఇదొక్కటి మాత్రం నాకు జవాబు లేని ప్రశ్న గా మిగిలిపోయింది..’ అని శర్వా డైలాగ్ తో నిండిన ఈ టీజర్ ఆకట్టుకుంది. ఒక పల్లె వాతావరణంలో ఉన్న విజువల్స్ తో టీజర్ అలరించింది. అంతే కాకుండా ఇప్పుడున్న జెనెరేషన్ వ్యవసాయం ఎందుకు చెయ్యట్లేదు ఎందుకు చెయ్యాలో అనే సోషల్ మెసేజ్ జోడించి ఈ సినిమా రూపొందించినట్టు తెలుస్తుంది.

14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. కిశోరె అనే నూతన దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శతమానం భవతి తర్వాత శర్వా మళ్ళీ ఆ ఛాయలు ఉన్న పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వా లుక్స్ పూర్తిగా ఒక విలేజ్ లో ఉండే రైతు లాగే ఉన్నాడు. ఈ సినిమాలో శర్వా కి జోడీ గ ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. శివరాత్రి సందర్భంగా మార్చ్ 11 న ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టి మళ్ళీ పూర్వ ఫార్మ్ లోకి రావడానికి శర్వా ప్రయత్నిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular