టాలీవుడ్: తెలుగు లో ఉన్న హీరోల్లో కంటెంట్ ఉన్న సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్లు అద్భుతంగా పోషించగల నటుడు అంటూ సెపెరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న నటుడు శర్వానంద్. శర్వానంద్ హీరోగా ‘శ్రీకారం’ అనే సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. బాగా చదువుకుని సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ అమెరికా కి వెళ్లి కంపెనీ ని ముందుకు నడిపించే అవకాశం వచ్చినపుడు అవి కాదనుకుని పల్లెటూరికి వచ్చి ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయం చేసే పాత్రలో శర్వానంద్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.
సినిమాలో హీరో ని ప్రేమించే అమ్మాయిగా గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. హీరో విలేజ్ లో ఉండి శర్వానంద్ కి అడ్డుపడే పాత్రలో సాయికుమార్ నటిస్తున్నాడు. శర్వా తండ్రి పాత్రలో రావు రమేష్ మరో అద్భుతమైన పాత్ర చేసాడని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. నీటి ఎద్దడితోనో, నష్టాలొచ్చాయనో ఇలా రక రకాల కారణాల వలన వూళ్ళో వ్యవసాయం మానేసి వలస వెళ్తున్న గ్రామస్థులని మోటివేట్ చేసి మళ్ళీ వాళ్ళని వ్యవసాయం వైపు నడిపించే పాత్రలో శర్వా నటిస్తున్నాడని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది.
ఇంచు మించు ఇలాంటి కాన్సెప్ట్ తో మహేష్ బాబు మహర్షి సినిమా వచ్చింది. మరి ఈ సినిమా ప్రత్యేకత ఏంటి అనేది విడుదలయ్యాక తెలుస్తుంది. సాయి మాధవ్ బుర్రా మాటలు, మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. కిశోరె రెడ్డి అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు. 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా మార్చ్ 11 న ఈ సినిమా విడుదల అవనుంది.