టాలీవుడ్: RX100 సినిమాతో మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ పొందిన డైరెక్టర్ అజయ్ భూపతి. కొంచెం టైం తీసుకుని తన రెండవ సినిమాని ప్రతిష్టాత్మకంగా మల్టీ స్టారర్ సినిమా రూపొందిస్తున్నాడు. శర్వానంద్, బొమ్మరిల్లు సిద్దార్థ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. మహా సముద్రం అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ‘వెలకట్టలేని ప్రేమ’ అనే టాగ్ లైన్ తో రాబోతుంది. ప్రేమ , ఎమోషన్ మరియు ఇంటెన్సిటీ ఉన్న కథ అన్నట్టు ఇదివరకే హింట్స్ వదిలారు డైరెక్టర్. ఈ రోజు ఈ సినిమా హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి శర్వానంద్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది సినిమా టీం.
చేతిలో బోట్ డైరెక్షన్ మరియు ఇంజిన్ లో వాడే ఫ్యాన్ లాంటి ఒక మెషినరీ ని ఫైట్ లో ఆయుధంగా వాడి చేతిలో పట్టుకుని ఇంటెన్సిటీ తో ఉన్న శర్వానంద్ లుక్ ఆకట్టుకుంది. చాల రోజుల తర్వాత శర్వానంద్ మరోసారి ఇంటెన్స్ యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో కనిపిస్తున్నట్టు అర్ధం అవుతుంది. సిద్దార్థ్ కూడా చాలా సంవత్సరాల తర్వాత డైరెక్ట్ తెలుగు మూవీ లో నటిస్తున్నాడు. AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ బ్రాహ్మణ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అదితి రావు హైదరి మరియు అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగష్టు 19 న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నారు.