fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsఏప్రిల్ లో శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ'

ఏప్రిల్ లో శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’

ShekarKammula LoveStory ReleaseDateLocked

టాలీవుడ్: సెన్సిబుల్ కథలు, సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తియ్యడం లో స్పెషలిస్ట్ అయిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రస్తుతం రాబోతున్న సినిమా ‘లవ్ స్టోరీ’. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాకి సంబందించిన పోస్టర్స్, టీజర్స్ , విడుదలైన సాంగ్ విపరీతం గా ఆకట్టుకున్నాయి. ఒక విధంగా ఈ సినిమా క్రేజ్ ని బాగా పెంచాయి. ఎప్పటి నుండో విడుదలవుతుంది అనుకున్న ఈ సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ప్రకటించారు. పోయిన సంవత్సరం ఏప్రిల్ విడుదలకి ప్లాన్ చేసిన ఈ సినిమా ఈ సంవత్సరం ఏప్రిల్ కి విడుదల అవుతుంది. ఏప్రిల్ 16 న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

సోనాల్ నారంగ్ సమర్పణలో ఏషియన్ మూవీస్ వారి శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి మరియు శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. పవన్ సి.హెచ్ సంగీతం ఈ సినిమాకి ప్రతీక ఆకర్షణ అవుతుందనడం లో సందేహం లేదు. ఇప్పటికి విడుదలైన టీజర్ లో అది స్పష్టంగా తెలుస్తుంది. శేఖర్ కమ్ముల కూడా గోదావరి లాంటి సినిమాని సమ్మర్ లో విడుదల చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సారి కూడా మరో సమ్మర్ బ్లాక్ బస్టర్ కోసం సినిమాని సిద్ధం చేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular