టాలీవుడ్: టాలీవుడ్ లో సెన్సిబుల్ లవ్ స్ట్రోరీస్ రూపొందించడంలో ఎక్స్పర్ట్ అయిన శేఖర్ కమ్ముల నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ అనే సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా నుండి ‘సారంగ దరియా’ అంటూ సాగే పాట విడుదలైంది. ఈ పాట కోసం సారంగ దరియా అని సాగే ఒక జాన పదాన్ని తీసుకొని దానికి సినిమాకి తగ్గట్టు సాహిత్యం అందించాడు సుద్దాల అశోక్ తేజ. అయితే ఈ పాట మొదట వెలుగులోకి వచ్చింది తన వల్ల అని ఆ ఆపాట క్రెడిట్స్ తనకే చెందాలని కనీసం పాట అయినా తనతో పాడించి ఉండాల్సింది అని కోమలి మీడియా ముందుకు వచ్చింది.
ఈ పాట విడుదలై సూపర్ హిట్ అయిన దానికన్నా ఈ పాట వివాదం రోజు రోజుకి ముదురుతుండడం తో డైరెక్టర్ శేఖర్ కమ్ముల దీనిపై స్పందించాడు. ఈ పాట ఎంచుకున్న తర్వాత కోమలి ని సంప్రదించడం, కొన్ని కారణాల వలన కోమలితో పాడించకపోవడం లాంటివి జరిగాయని చెప్పాడు. అంతే కాకుండా ఈ పాట క్రెడిట్స్ మరియు డబ్బులు కోమలి కి అందిస్తామని ఆడియో ఫంక్షన్ లో కోమలి తో స్టేజ్ పైన ఈ పాట కూడా పాటిస్తామని శేఖర్ కమ్ముల హామీ ఇవ్వడంతో ఈ వివాదం ముగిసినట్టే అనిపిస్తుంది. ఏది ఏమైనా వివాదాల జోలికి వెళ్లని శేఖర్ కమ్ముల తన సినిమా బిజీ లో ఉండి ఇవన్నీ చూడలేదని తెల్సిన వెంటనే దీనిని ఒక పబ్లిసిటీ కి వాడుకోకుండా తన వంతుగా వివాదాన్ని ముగించే ఏర్పాటు చేయడం అభినందనీయం.