బాలీవుడ్: ఇండియా పాకిస్తాన్ యుద్దానికి సంబందించిన సినిమాలు ఇప్పటికి చాలానే వచ్చాయి. ప్రస్తుతం ఆగష్టు లో కూడా రెండు సినిమాలు విడుదలకి సిద్ధం గా ఉన్నాయి. అందులో అజయ్ దేవగన్ నటించిన ‘భుజ్’ మరొకటి సిద్దార్థ్ మల్హోత్రా నటించిన ‘షేర్ షా’. ఈ రోజు షేర్ షా సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. పరమ వీర చక్ర అవార్డు గ్రహీత, 1999 కార్గిల్ యుద్ధంలో శత్రువులతో భీకర పోరాటం చేసి వీరమరణం చెందిన కెప్టెన్ విక్రమ్ బాత్రా కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.
ట్రైలర్ ఆరంభంలో కెప్టెన్ బాత్రా సైనికుడి బాధ్యతలు తీసుకునే సీన్ తో మొదలుపెట్టారు. ఒక దేశ సైనికుడిగా ఉండడం పెద్ద గౌరవం, మిలిటరీ యూనిఫామ్ వేసుకోవడం లో ఒక గౌరవం, దేశానికి మించిన ధర్మం లేదు అంటూ ట్రైలర్ ప్రారంభించారు. సైనికుడి గా మిలిటరీ లో చేరిన తర్వాత అక్కడి ప్రదేశం ఎంత అందంగా ఉంటుందో యుద్ధం సమయంలో అంత భయంకరంగా ఉంటుంది అని కొన్ని సీన్స్ చూపించారు. బాత్రా తన స్నేహితుడితో చేసే సంభాషణలో నేను శత్రువులతో పోరాడి అక్కడ మన జెండా ని ఎగరవేసి వస్తా.. లేదంటే మన జెండాని నా పై కప్పించుకుని వస్తా.. తిరిగి రావడం మాత్రం పక్క … లాంటి డైలాగ్స్ తో ట్రైలర్ అదరగొట్టారు. సిద్దార్థ్ కి జోడీ గా కియారా అద్వానీ ఈ సినిమాలో నటిస్తుంది. కెప్టెన్ విక్రమ్ బాత్రా కి కోడ్ నేమ్ అయిన ‘షేర్ షా’ నే సినిమా టైటిల్ గా పెట్టారు.
దేశభక్తి ఆధారంగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ద్వారా బాగానే ఆకట్టుకున్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ తో పంజా సినిమాని రూపొందించిన డైరెక్టర్ విష్ణు వర్ధన్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. ధర్మ ప్రొడక్షన్స్ మరియు కాశ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఆగష్టు 13 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.