కోలీవుడ్: ‘మన్మధ’, ‘వల్లభ’ లాంటి సినిమాల ద్వారా శింబు తెలుగు అభిమానులకి సుపరిచితం. టి రాజేందర్ నటవారసుడిగా సినిమాల్లోకి పరిచయం అయ్యి తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పరచుకొని తమిళ్ లో మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ బేస్ తెచ్చుకున్న హీరో శింబు. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని వివాదాల వలన సినిమాలు , ఆఫర్లు తగ్గిపోవడం జరుగుతుంది. కానీ శింబు నటన కోసం ఇప్పటికీ కొన్ని ఆఫర్లు వెంటాడుతున్నాయి. శింబు చివరగా చేసిన సినిమా మణిరత్నం నవాబ్. ఆ సినిమాలో చాలా లావుగా ఉంది షేప్ అవుట్ అయినట్టు ఉండడం తో శింబు పని అయిపొయింది అనుకున్నారు. కానీ తాను మళ్ళీ వరుస సినిమాలు లైన్ లో పెడుతూ బౌన్స్ బ్యాక్ అబుతున్నాడు.
శింబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘ఈశ్వరన్’. ఈ సినిమాకి సంబందించిన మోషన్ పోస్టర్ దసరా సందర్భంగా విడుదల చేసారు. ఒక గ్రామీణ నేపధ్యం లో ఈ సినిమా కథ రూపొందించబడింది. మోషన్ పోస్టర్ లో చేతిలో పాము పట్టుకొని పొలాల్లో కనిపిస్తాడు శింబు. ఈ సినిమాలో శింబు లుక్ చూస్తుంటే బాగా సన్నబడి పాత రూపం లోకి వెళ్లినట్టు కనపడుతుంది. ఈ సినిమాలో శింబు కి జోడీ గా ఇస్మార్ట్ హెరాయిన్ ‘నిధి అగర్వాల్’ నటిస్తుంది. మహాదేవ్ మీడియా బాలాజీ సమర్పణలో డి కంపెనీ , కేవీ దురై బ్యానర్ లో ఈ చిత్రం నిర్మించబడుతుంది. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ‘సుశీంద్రన్’ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాతో పాటు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు శింబు. అలాగే నార్తన్ దర్శకత్వంలో మరో కన్నడ సినిమా రీమేక్ చేస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.