
కోలీవుడ్: చాలా రోజుల తర్వాత శింబు తన పాత రూపం లోకి వచ్చి ‘ఈశ్వరన్’ అనే ఒక సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. సంక్రాతి సందర్భంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల అయింది. ఇంతకముందు విడుదలైన పోస్టర్స్ లో శింబు కొత్త లుక్ తో అందర్నీ ఆశ్చర్య పరచాడు. శింబు ఫాన్స్ ఆనందానికి అవధులు లేవు. ట్రైలర్ లో మళ్ళీ పాత శింబు ని చూపించే ప్రయత్నం చేసారు. ఆ పాత మేనరిజమ్స్ లాంటివి కొన్ని ట్రై చేసారు. ట్రైలర్ వరకు శింబు ఆకట్టుకున్నారు. ఒక గ్రామీణ నేపధ్యం లో ఉండే రెండు కుటుంబాల మధ్య ఉండే ఘర్షణ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. దానికి కొంచెం జ్యోతిష్యం మరియు దేవుడి కాన్సెప్ట్ ని జోడించి చూపిస్తున్నట్టు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు.
ఈశ్వరన్ సినిమాలో శింబు కి జోడీ గా ఇస్మార్ట్ బ్యూటీ ‘నిధి అగర్వాల్’ నటిస్తుంది. మరి కొన్ని పాత్రల్లో భారతి రాజా, నందిత శ్వేతా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా పైన శింబు చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేనప్పటికీ థమన్ సంగీతాన్ని తీసి పారేయలేం అనేది కూడా తెల్సిన విషయమే. బాలాజీ కాపా నిర్మాణం లో ఈ సినిమా రూపొందింది. సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14 న విడుదల అవుతుంది.