కోలీవుడ్: కోలీవుడ్ నటుడు శింబు మంచి టాలెంట్ ఉన్న నటుడిగా, టెక్నీషియన్ గా కెరీర్ ప్రారంభించినప్పటికీ కెరీర్ లో వచ్చిన వివాదాల వలన , బాడీ షేప్ అవుట్ అవడం వలన వరుస ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొన్నాడు. కానీ లాక్ డౌన్ సమయంలో బాడీ ని ట్యూన్ చేసుకుని కం బ్యాక్ అయ్యి వరుస సినిమాలు చేస్తూ మళ్ళీ పాత శింబు ని గుర్తుకు తెస్తున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కి ‘ఈశ్వరన్’ అనే మాస్ సినిమాతో పలకరించాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే పొలిటికల్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా సినిమా పైన మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ రోజు శింబు నటించే తరువుత సినిమాకి సంబందించిన ప్రకటన మరియు ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత సినిమా పైన అమాంతం అంచనాలు పెరిగాయి.
గౌతమ్ మీనన్ సినిమాలు అంటే ఒకటి పోలీస్ కథలు లేదా అద్భుతమైన ప్రేమ కథలు గుర్తుకు వస్తాయి. ఆ జానర్లలో గౌతమ్ మీనన్ అద్భుతమైన విజయాలు సాధించాడు. గౌతమ్ మీనన్ మరియు శింబు కాంబినేషన్ లో ఇదివరకు ‘విన్నైతాండి వరువాయ’, ‘అచ్చమ్ ఎంబదు మదమైయ్యాడా’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రెండు అద్భుతమైన లవ్ స్టోరీస్ గా వచ్చిన వీళ్ళ కాంబినేషన్ లో మూడవ సినిమా ఈ రోజు ప్రకటించారు. ‘వెందు తనిందంతు కాడు’ అనే టైటిల్ తో విడుదల చేసిన శింబు ఫస్ట్ లుక్ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. పూర్తిగా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వెనక అడవి కాలిపోతుండగా చేతిలో కర్ర పట్టుకుని చిరిగిన బట్టలు పాత చెప్పులు వేసుకుని మసి పట్టిన మొహం తో శింబు లుక్ అదరగొట్టింది అని చెప్పుకోవచ్చు. శింబు వయసు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాడు. వీళ్ళ హ్యాట్రిక్ కాంబినేషన్ కి మరోసారి AR రహమాన్ ఈ సినిమాకి పని చేయనున్నాడు.