కోలీవుడ్: టి రాజేందర్ వారసుడిగా గా సినీ ఇండస్ట్రీ కి వచ్చి తన ప్రత్యేక శైలి తో హీరోగా, డాన్సర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా, సింగర్ గా ఇలా రక రకాలుగా సినిమాకు పని చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు మరియు ఫ్యాన్ బేస్ పెంచుకున్న హీరో శింబు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా శింబు అఫైర్ల వలన, రాంగ్ స్టోరీ సెలెక్షన్ వలన చాలా ప్లాప్ లు ఎదుర్కొని చివరగా వచ్చిన సినిమాలో కూడా బాగా లావు గా కనపడడం లాంటివి చూసి ఇక శింబు పని అయిపోయింది అనుకున్నారు అందరు. కానీ ఒక ఆరు నెలల్లో దాదాపు ముప్పై కిలోలు తగ్గి మళ్ళీ 10 -15 సంవత్సరాల క్రితం వచ్చిన మన్మధ లుక్ లోకి వచ్చాడు. ఇపుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ తానింకా రేస్ లో ఉన్నాను అని నిరూపించుకున్నాడు. ఈ మధ్యనే విడుదలైన ఈశ్వరన్ ఫస్ట్ లుక్ మరియు టీజర్ ద్వారా అభిమానులని సర్ప్రైస్ చేసి ఇపుడు మరొక సినిమా అప్డేట్ తో జోరు చూపిస్తున్నాడు.
శింబు ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ ‘వెంకట్ ప్రభు‘ దర్శకత్వంలో ‘మానాడు’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ఇవాళ విడుదల చేసాడు. ఈ ఫస్ట్ లుక్ తో అభిమానులు ఈ సినిమా పై మరింత ఆసక్తి ని చూపిస్తున్నారు. ఈ సినిమాలో అబ్దుల్ కాలిక్ అని ముస్లిం యువకుడు పాత్రలో శింబు కనిపించబోతున్నాడు. ఈ ఫస్ట్ లుక్ లో తలలో బులెట్ దిగి రక్తం కారుతున్నా కూడా శింబు నమాజ్ చేస్తూ కనిపిస్తాడు. కింద వెంకట్ ప్రభు పాలిటిక్స్ అని టాగ్ లైన్ జత చేసాడు డైరెక్టర్. ఈ సినిమా రాజకీయ లబ్ది కోసం చేసే మత పరమైన అల్లర్లకు సంబందించిన సినిమా గా అనిపిస్తుంది. ఏది ఏమైనా శింబు మునుపటి లుక్ లోకి వచ్చి వరుస సినిమాలు చేయడం అందరికి ఆనందంగా వుంది. ఒక మంచి నటుడు మళ్ళీ పూర్వ ఫామ్ లోకి వస్తే ఇంకా మంచి సినిమాలు కొన్ని చూడచ్చు అని సినిమా అభిమానుల కోరిక.