
టాలీవుడ్: పెళ్లిచూపులు నిర్మాత ‘రాజ్ కందుకూరి’ తనయుడు శివ కందుకూరి ‘చూసి చూడంగానే’ అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యాడు. తర్వాత మేఘ ఆకాష్ తో కలిసి ‘మను చరిత్ర’ అనే ఒక లవ్ స్టోరీ రూపొందించారు కానీ ఈ సినిమా గురించి ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ వినిపించలేదు. ఈ మధ్యనే శ్రియ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘గమనం’ అనే సినిమాలో ఒక క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇపుడు తన నాల్గవ సినిమాగా ‘చేతక్ శ్రీను’ గా రాబోతున్నాడు. ఈ సినిమాలో పాత కాలంలో ఎంతో మంది మిడిల్ క్లాస్ ఇళ్లల్లో ఉండే బజాజ్ చేతక్ బండిని ఒక కారెక్టర్ లాగా చూపించబోతున్నారు. టైటిల్ లో కూడా సింబాలిక్ గా చేతక్ అని పెట్టారు.
కథనం వంటి సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ‘రాజేష్ నాదెండ్ల’, ఈ డైరెక్టర్ చేతక్ శ్రీను సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి చాలా కాలం తర్వాత సంగీతం అందించనున్నారు. మెలోడీస్ కి స్పెషలిస్ట్ అని నిరూపించుకున్న అనూప్ నుండి మరొక మంచి ఆల్బమ్ ఊహించవచ్చు. కామిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాతో కలిపి శివ కందుకూరి దగ్గరి నుండి వచ్చే సంవత్సరం మూడు సినిమాలు రావచ్చు. ఈ సినిమాకి రాజకాంత్ తౌటి కథ అందించనున్నారు. రవి ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై రవి చరణ్ మెరిపో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.