fbpx
Sunday, January 5, 2025
HomeMovie Newsసెన్సార్ పూర్తి: విడుదలకు సిద్ధమైన శివం భజే!

సెన్సార్ పూర్తి: విడుదలకు సిద్ధమైన శివం భజే!

SHIVAM-BHAJE-COMPLETES-SENSOR-READY-TO-RELEASE
SHIVAM-BHAJE-COMPLETES-SENSOR-READY-TO-RELEASE

మూవీడెస్క్: అప్సర్ దర్శకత్వంలో యువ హీరో అశ్విన్ కథానాయకుడుగా విడుదలకు సిద్దమవుతున్న చిత్రం శివం భజే.

ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకోవడం, అలాగే సెన్సార్ బోర్డు నుండి ఈ చిత్రానికి ఊ/ఆ సర్టిఫికెట్ మంజూరు చేయడం జరిగింది.

కాగా, ఈ చిత్రం మొత్తం నిడివి 2 గంటల 6 నిమిషాలుగా నిలిచంది. కొత్త తరం కథ మరియు కథనాలతో చిత్రీకరించిన మూవీ శివం భజే.

ఈ చిత్రాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది.

ఈ చిత్రానికి నేపథ్య సంగీతం వికాస్ బడిస అందించారు. ఇందులో హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, షకలక శంకర్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular