బాలీవుడ్: కరోనా, లాక్ డౌన్ వల్ల థియేటర్ లు మూత పడడం, సినిమాలు ఏవి విడుదల అవకపోవడం, జనాలు అందరు ఎక్కువ శాతం ఇళ్లకే పరిమితం అవడం వల్ల ఓటీటీ కంటెంట్ కి ఆదరణ బాగా పెరిగింది. ఇంతక ముందు కొంతవరకు ఉండేది కానీ కరోనా వల్ల ఓటీటీ వీక్షకులు చాల వరకు పెరిగారు. ఈ దశలో వెబ్ సిరీస్ వ్యూయర్షిప్ బాగా పెరిగింది. మనోజ్ భాజ్ పాయ్ ప్రధాన పాత్రలో ఫామిలీ మాన్ అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా ‘ఫ్యామిలి మాన్ 2 ‘ రాబోతోంది. అయితే దీనికి సంబందించిన షూటింగ్ పూర్తి అయినట్టు మేకర్స్ ప్రకటించారు.
ఈ వెబ్ సిరీస్ లో ‘అక్కినేని సమంత’ విలన్ గా నటించబోతుంది. ఈ మధ్యనే తన డబ్బింగ్ కూడా తానే స్వయం గా చెపుతున్నట్టు ప్రకటించింది. ఇందులో సమంత తో పాటు మనోజ్ భాజ్ పాయ్, ప్రియమణి, సందీప్ కిషన్, తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్‌ను తెలుగు వారైన రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే డైరెక్ట్ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ వెబ్ సిరీస్ ఈపాటికి విడుదల అవ్వాల్సింది , కానీ కరోనా వల్ల షూటింగ్ మధ్యలో పెండింగ్ పడింది. ఈ మధ్యనే వాయిదా పడ్డ మిగిలిన షూటింగ్ కూడా తాజాగా కంప్లీట్ అయినట్లు దర్శకుడు రాజ్, డీకే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘ఫ్యామిలీ మ్యాన్ – 2’ త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.