హైదరాబాద్: మొన్నటి వరకు కరోనా తాకిడికి ఇంటి పట్టునే ఉన్న తారలందరూ ఒకరి తర్వాత ఒకరు కదులుతున్నారు. ఇపుడే పరిస్థితులు కుదుట పడే సిట్యుయేషన్ లేకపోవడం తో మెల్లగా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా వాళ్ళు కూడా మెల్లగా పెండింగ్ లో ఉన్న షూటింగ్ లు, కొత్త ప్రాజెక్ట్ లు, డబ్బింగ్ పనులు ఇలా అన్ని పనులు పూర్తి చేస్తుకుంటున్నారు. కోవిద్ జాగ్రత్తలు పాటిస్తూ వాల్ల పనుల్లో వాళ్ళు నిమగ్నం ఐతున్నారు. ఈ మధ్యనే నాగార్జున, నాగ చైతన్య షూటింగ్ ప్రారంభించారు. వీళ్ళ దారిలోనే అఖిల్ కూడా తాను నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’ సినిమా షూటింగ్ ప్రారంభించారు.
ఇప్పటికి మూడు సినిమాలు విడుదలైనా కూడా సరైన హిట్ పడకపోవడం తో అఖిల్ చాలా జాగ్రత్త గా అడుగులు వేస్తున్నాడు. తన నాల్గవ సినిమా కోసం లవ్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ కథని ఎంచుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. జిఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ తో పాటు పూజ హెగ్డే నటిస్తున్నారు. నిన్ననే హైదరాబాద్ లో ల్యాండ్ అయిన పూజ ఇవాళ ఆన్ లొకేషన్ పిక్ షేర్ చేస్తూ ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’ షూట్ లో ఉన్నట్టు తెలిపింది.