హాలీవుడ్: 2009 లో విడుదలై విడుదలైన అన్ని భాషల్లో రికార్డులు నెలకొల్పిన సినిమా అవతార్. దీనికి కొనసాగింపుగా ఈ సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మూడు, నాలుగు పార్ట్ లు వాటి విడుదల తేదీలు కూడా ప్రకటించాడు. అయితే అనుకోకుండా వచ్చిన కరోనా వల్ల షూటింగ్లు ఎక్కడివి అక్కడే నిలిచిపోవడం వలన ముందుగా ప్రకటించిన విడుదల తేదీలన్నిటికి సంవత్సరం పొడిగించారు. కోవిడ్ తర్వాత న్యూజీలాండ్ లో మళ్ళ్లీ షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా టీం అవతార్ పార్ట్ 2 షూటింగ్ ముగించారని డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.
పార్ట్ 3 కూడా దాదాపు 95 శాతం పూర్తి అయిందని కూడా చెప్పారు. అయితే ఈ సినిమాకి గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ ఉండడం వలన అదంతా పూర్తి చేసి విడుదల చేయడానికి కనీసం సంవత్సరం అయినా పడుతుంది అని చెప్పారు. ‘నాలుగున్నర నెలల పాటు సినిమా తీయలేకపోయాం. దాని ఫలితంగా మేము 2022 డిసెంబరు వరకూ విడుదల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరో పూర్తి సంవత్సరానికి ఆలస్యమే ఇది. ఇప్పుడు సినిమా పూర్తి చేయడానికి నాకు అదనపు సంవత్సరం ఉందని దీని అర్థం కాదు. ఎందుకంటే మేం అవతార్ 2 ను పంపిణీ చేసిన రోజు అవతార్ 3 ని పూర్తి చేసే పనిలో ఉంటాం’ అని కామెరూన్ అన్నారు.