fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsమొదలైన వర్మ బయోపిక్ షూటింగ్

మొదలైన వర్మ బయోపిక్ షూటింగ్

ShootingStartedFor RamGopalVarma Biopic

హైదరాబాద్: ప్రస్తుతం అందరి లైఫ్ స్టోరీలు, బయోపిక్ లు, రియల్ ఇన్సిడెంట్స్ తో సినిమాలు తీస్తున్న రామ్ గోపాల్ వర్మ బయో పిక్ ని ఒక కొత్త దర్శకుడు రూపొందించబోతున్నాడు. ఈ సినిమా మూడు భాగాలుగా ఉండబోతోంది. కాలేజీ డేస్ గురించి మొదటి భాగం లో, సినిమాలు- టాలీవుడ్ – బాలీవుడ్ రెండవ భాగం లో , బాలీవుడ్ నుండి మళ్ళీ టాలీవుడ్ కి రావడం మూడవ భాగం లో చూపించబోతున్నారని ముందే తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇవ్వాలే హైదరాబాద్ లో మొదలైంది. ఈ సినిమాని దొరసాయి తేజ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. విశేషం ఏంటంటే ఆర్జివీ మొదటి పార్ట్ ‘రాము’ లో ఆర్జివీ పాత్రలో ఈ కుర్రాడే నటించబోతున్నాడు. ఈ దర్శకుడి వయసు 20 ఏళ్ళే అని ఆర్జివీ తెలిపాడు.

ఈ సినిమా షూటింగ్ మొదటి షాట్ కి ఆర్జివీ తల్లి సూర్యవతి గారు కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, ఆర్జివీ సోదరి విజయ క్లాప్ కొట్టారు. ఈ సినిమా మూడు పార్ట్ లని బొమ్మాకు మురళి నిర్మిస్తున్నారు. అలాగే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా డైరెక్టర్ దొరసాయి తేజ ని సోషల్ మీడియా కి పరిచయం చేసారు. అందరి కథలు రాసే వర్మ కథ ఎలా రాసారో ఎలా తీస్తారో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular