కోలీవుడ్: నేషనల్ అవార్డు విన్నింగ్ కొరియోగ్రాఫర్ ‘బృంద మాస్టర్’ ప్రస్తుతం మెగా ఫోన్ పట్టుకొని డైరెక్టర్ అవతారం ఎత్తారు. ఇదివరకే డైరెక్టర్ గా మారిన కొరియోగ్రాఫర్స్ చాలా మంది సూపర్ సక్సెస్ అయ్యారు. ఇపుడు వారి బాటలోనే బృంద మాస్టర్ ఒక సినిమాని రూపొందిస్తుంది. తన సొంత ఇండస్ట్రీ మలయాళం మాత్రమే కాకుండా సౌత్ మొత్తం తన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కరోనా తర్వాత ఈ సినిమా షూటింగ్ వేగంగా జరిపి ఈ రోజే ఈ సినిమా షూటింగ్ కి ముగింపు పలికారు.
‘హే సినామిక’ అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమాలో దుల్కర్ తో పాటు ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. దుల్కర్ కి జోడీ గా కాజల్ అగర్వాల్ మరియు అదితి రావు హైదరి నటిస్తున్నారు ఈ సినిమాని తమిళ్ లో రూపొందించినప్పటికీ దుల్కర్ సల్మాన్ కి ఉన్న మార్కెట్, అమ్మాయిల్లో అతనికి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని సౌత్ లో ఉన్న అన్ని భాషల్లో ఈ సినిమాని విడుదల చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా టీం జనవరి లో ఈ సినిమాని విడుదల చేసే ఉదేశ్యం లో ఉన్నారు.