హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్‘ పేరుతో ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టిన విషయం తెల్సిందే. ఈ ప్రొడక్షన్స్ లో మొదటి ప్రయత్నం గా ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్ ని నిర్మించారు. ఇది ఒక క్రైం థ్రిల్లర్ జానర్ లో రూపొందుతుంది. హీరో శ్రీకాంత్ ప్రధాన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇందులో నటిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆలేరు లో జరిగిన షూట్ అవుట్ ఘటనల ఆధారంగా చేసుకుని తీసిన సిరీస్ లాగ అనిపిస్తుంది. టీజర్ లో కథ ఐతే పూర్తిగా రివీల్ చేయనప్పటికీ అల్లర్లు, పోలీస్ ఎంక్వయిరీ లాంటివి చూపించాడు.
‘ఓయ్’ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ని డైరెక్ట్ చేసిన ‘ఆనంద్ రంగ’ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. ఆనంద్ రంగ ‘ఓయ్’ సినిమా తర్వాత చాలా సినిమాలకి సహాయ దర్శకుడిగా, మెంటార్ లాగ పని చేసాడు కానీ పూర్తి డైరెక్టర్ గా చేయడం ఇన్ని రోజుల తర్వాత ఇదే. ఈ వెబ్ సిరీస్ లో శ్రీకాంత్ తో పాటు మరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రకాష్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయ్ నటిస్తున్నారు. క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 25 నుండి ZEE5 ఓటీటీ లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉండబోతున్నట్టు ప్రకటించారు.