టాలీవుడ్: ఈ ఏడాది ఉప్పెన సినిమాతో సినిమా ప్రయాణం ప్రారంబించి మొదటి సినిమాతోనే వంద కోట్ల రికార్డ్ సాధించిన హీరోగా ఘనత సాధించాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా పూర్తవకముందే క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ మరో ప్రధాన పాత్రలో ఒక సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ప్రస్తుతం వైష్ణవ తేజ్ తన మూడవ సినిమాని మొదలుపెట్టాడు.
శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై బి.వీ.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాకి అసిస్టెంట్ గా పని చేసి తమిళ్ అర్జున్ రెడ్డి ని రూపొందించి హిట్ సాధించిన గిరీశయ్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా నటించిన కేతిక శర్మ ఈ సినిమాలో వైష్ణవ్ కి జోడీ గా నటించనుంది. ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. మొదటి షాట్ కి వైష్ణవ తేజ్ అన్న సాయి ధరమ్ తేజ్ క్లాప్ కొట్టగా అమ్మ విజయ దుర్గ గారు కెమెరా ఆన్ చేసి షూటింగ్ మొదలు పెట్టారు.