fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsషూటింగ్ పూర్తి చేసుకున్న 'మహా సముద్రం'

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మహా సముద్రం’

ShootWrap For MahaaSamudram

టాలీవుడ్: RX100 సినిమా ద్వారా తొలి పరిచయం తోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన దర్శకుడు ‘అజయ్ భూపతి’. కొంచెం గ్యాప్ తీసుకుని ఈ దర్శకుడు రూపొందిస్తున్న రెండవ సినిమా ‘మహా సముద్రం’. ఈ సినిమాని ఒక మల్టీ స్టారర్ గా రూపొందిస్తున్నాడు. ఒక ఇంటెన్స్ లవ్ మరియు యాక్షన్ సినిమా గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నటీ నటుల్ని కూడా అలాగే ఎంపిక చేసుకున్నారు. శర్వా నటన గురించి తెలిసిందే, ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత మరో నేషనల్ లెవెల్ గుర్తింపు పొందిన నటుడు బొమ్మరిల్లు సిద్దార్థ్ మరో హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ లుగా అదితి రావు హైదరి మరియు అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు.

ఈ రోజు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్టు ఒక పోస్టర్ విడుదల చేసారు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగులో వస్తున్నందుకు హ్యాపీ గా ఉందని సిద్దు తెలిపాడు. ఈ పోస్టర్ లో శర్వా మరియు సిద్దార్థ హ్యాపీ ఫేసెస్ తో ఏదో సాధించిన ఆనందంలో ఉన్నట్టు చూపించారు. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదల చేసిన జగపతి బాబు, రావు రమేష్ లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ బ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గవర్నమెంట్ అప్రూవల్స్ మరియు థియేటర్ లు తెరచుకోగానే సమయం చూసి సినిమాని విడుదల చేస్తామని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular