టాలీవుడ్: దాదాపు 20 ఏళ్ల సినీ ప్రస్తానం శ్రియ సొంతం. ఇప్పటికీ గ్లామర్ పాత్రలు, నటన కి ఆస్కారం ఉన్న పాత్రలు ఏ ఛాయస్ అయినా చెయ్యగల నటి శ్రియ శరన్. 2001 లో ‘ఇష్టం’ అనే సినిమా ద్వారా సినిమా కి పరిచయం అయి ఇంకా తన సినీ ప్రస్తానం కొనసాగిస్తుంది. ఈ రోజు శ్రియ పుట్టిన రోజు సందర్భంగా శ్రియ ప్రస్తుతం నటిస్తున్న ‘గమనం’ అనే సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు సినిమా టీం.
సుజనా రావు దర్శకత్వం వహిస్తున్న రియల్ లైఫ్ డ్రామా ”గమనం” చిత్రంలో శ్రియా శరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈరోజు శ్రియా పుట్టినరోజు సందర్భంగా ‘గమనం’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ విడుదల చేశారు.”గమనం” చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అలాగే తెలుగు లో టాప్ మోస్ట్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర ఈ సినిమాకి మాటలు అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ మాత్రమే కాకుండా ఒక నిర్మాత కూడా. రమేష్ కరుటూరి – వెంకీ పుషడపు లతో కలిసి జ్ఞానశేఖర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిత్య మీనన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.