మూవీడెస్క్: తెలుగు సంగీత ప్రపంచంలో సిద్ శ్రీరామ్ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.
ఆయన గాత్రంలో మునకలేస్తే, ప్రతి పాట మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన అనుభూతిని ఇస్తుంది.
“శ్రీవల్లి” లాంటి సూపర్ హిట్ సాంగ్ తో పుష్ప-1 క్రేజ్‌ను పెంచిన సిద్, తాజాగా కొత్త పాటలు పాడకపోవడం అభిమానులను నిరాశలోకి నెట్టింది.
దీనిపై ఆయన కూడా వివరణ ఇచ్చాడు.
సిద్ శ్రీరామ్ మాట్లాడుతూ, “సంగీత దర్శకులు అవకాశం ఇస్తేనే పాటలు పాడతాను.
పుష్ప-2లో నాకు అవకాశం ఇవ్వలేదు. ఈ విషయం గురించి దేవి శ్రీ ప్రసాద్‌నే అడగాలి,” అంటూ తన మనసులో మాట చెప్పాడు.
మరికొంతమంది సిద్ రెమ్యునరేషన్ ఎక్కువవ్వడం వల్ల సంగీత దర్శకులు ఆయన్ను దూరంగా ఉంచుతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది.
అయితే, సిద్ శ్రీరామ్ ఈ మధ్య కాలంలో లైవ్ కన్సర్ట్‌లపై ఎక్కువ దృష్టి పెట్టాడు.
ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లో నిర్వహించనున్న లైవ్ షో ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.
తెలుగు మాట్లాడే ప్రయత్నం కూడా అభిమానులను ఆకట్టుకుంది.
సిద్ తన ప్రతి పాటతోనే మ్యూజిక్ లవర్స్‌ను గెలుచుకున్నాడు.
అయితే, మళ్లీ ఆయన గాత్రం వినిపించడానికి సంగీత దర్శకులు అవకాశం ఇస్తారా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.