మూవీడెస్క్: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ మధ్య కాంబినేషన్ హిట్ల పండుగలా మారింది.
డీజే టిల్లు సినిమాతో మొదలైన ఈ కాంబో, రీసెంట్‌గా టిల్లు స్క్వేర్‌తో మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించాయి.
ఇప్పుడు సిద్ధు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే రవికాంత్ పెరెపు దర్శకత్వంలో సోషియో ఫాంటసీ డ్రామా ‘కోహినూర్’ సినిమాను ప్రకటించారు.
ఈ సినిమా కూడా సితార బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తుండటంతో, వీరి కాంబోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
కోహినూర్ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే సిద్ధు, టిల్లు సిరీస్‌లో తదుపరి భాగమైన ‘టిల్లు క్యూబ్’లో కూడా నటించనున్నాడు.
ఈ మూడు ప్రాజెక్టులకు గాను సిద్ధుకు పెద్ద మొత్తంలో పారితోషికం అందుతుందని సమాచారం.
ఇలా మూడు సినిమాలతో మళ్లీ సిద్ధు-నాగవంశీ కాంబో సత్తా చాటనుందా? వేచి చూడాల్సిందే.