మూవీడెస్క్: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాల తర్వాత భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు.
కానీ, ఈ సినిమాల కంటే ముందు చేసిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ, పెద్దగా రీచ్ కాలేదు.
2020 లాక్‌డౌన్ సమయంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు కొత్త రూపంలో థియేటర్స్‌లోకి రాబోతోంది.
రానా సమర్పణలో ఈ సినిమా ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అనే కొత్త టైటిల్‌తో ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.
దర్శకుడు రవికాంత్ పేరెపు తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి హీరోయిన్లుగా నటించారు.
శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ మూవీ, థియేటర్ అనుభవానికి తగ్గట్టుగా మళ్లీ ట్రిమ్ చేసి, మరింత ఎంగేజింగ్‌గా మార్చారు.
ఫిబ్రవరి 14న విశ్వక్ సేన్ ‘లైలా’, కిరణ్ అబ్బవరం ‘దిల్ రుబా’ రిలీజ్ కావాల్సి ఉన్నా, ఈ సినిమాలు వాయిదా పడే అవకాశముందనే టాక్ ఉంది.
దీంతో ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ కు మంచి సక్సెస్ ఛాన్స్ ఉన్నట్లు అనిపిస్తోంది.
ముఖ్యంగా ఓటీటీలో పూర్తిగా రీచ్ కాలేకపోయిన సిద్దు క్రేజ్ వల్ల ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.
ఇక ఇదేరోజు రామ్ చరణ్ ‘ఆరెంజ్’ కూడా రీ-రిలీజ్ కానుండగా, యూత్ మూడ్‌లో మాత్రం ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ ఎక్కువగా క్లిక్ అయ్యేలా కనిపిస్తోంది.
రానా ఈ సినిమాను కొత్తగా ప్రెజెంట్ చేయడం, ప్రొమోషన్స్‌కి ప్లాన్ చేయడం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.