టాలీవుడ్ స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం జాక్ ట్రైలర్‌తో దుమ్మురేపుతోంది. ఏప్రిల్ 10న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ట్రైలర్ ప్రారంభంలో ప్రకాష్ రాజ్ పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఆసక్తిని రేపగా, సిద్ధు ఎంట్రీ మాస్ మసాలాతో అదరగొట్టాడు. మారువేషాల్లో అతని ప్రెజెన్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్ అయ్యాయి.
‘బటర్‌ఫ్లై మిషన్’ పేరుతో ప్రైవేట్ స్పై ఏజెంట్‌గా సిద్ధు పాత్ర ఉండబోతోంది. కథలో రొమాన్స్, మిషన్, టెర్రరిస్టుల ఛేజింగ్ సీన్స్ ను ట్రైలర్‌లో చూపించారు.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అద్భుతంగా నిలిచాయి. కొంచెం క్రాక్ అన్న ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే కథలో క్రేజీ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్, సిద్ధు మధ్య సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఫన్, యాక్షన్ సమపాళ్లలో ఉండే సినిమా అని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
ట్రైలర్ తో పక్కా యూత్ మాస్ ఎంటర్టైనర్‌గా మేకర్స్ హింట్ ఇచ్చారు. మరి జాక్ సినిమా సిద్ధుకు ఇంకో హిట్ అందిస్తుందా? అన్నది ఎప్రిల్ 10న తేలనుంది.