fbpx
Sunday, April 6, 2025
HomeMovie News'SR కళ్యాణమండంపం'- సిగ్గెందుకురా పాట విడుదల

‘SR కళ్యాణమండంపం’- సిగ్గెందుకురా పాట విడుదల

SigguEndukuraSong ReleasedFrom SRKalyanaMandapam

టాలీవుడ్: ‘రాజా వారు రాణి గారు’ అనే సినిమాతో హీరో గా పరిచయం అయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాలో విలేజ్ లో ఉండే ఒక అమాయకపు పాత్రలో నటించిన ఈ హీరో రెండవ సినిమా గా ‘SR కళ్యాణమండంపం‘ అనే రొమాంటిక్ కామెడీ మూవీ తో వస్తున్నాడు. ఈ సినిమాలో కాలేజ్ లో అమ్మాయి వెంట పడే కుర్రాడిగా కనపడనున్నాడు. ఈ సినిమా నుండి ఇదివరకే విడుదలైన పాటలు చార్ట్ బస్టర్ లో టాప్ లో ఉన్నాయి. ఈ రోజు ఈ సినిమా నుండి ‘సిగ్గేందుకురా’ అంటూ సాగే మాస్ పాట విడుదల చేసారు.

ఒక బార్ లో అమ్మాయి ఛీ కొట్టినా, వద్దు అన్నా కూడా ఎందుకు వెంటపడతావురా అన్నపుడు సిగ్గేందుకురా అమ్మాయి వెంట తిరగడానికి అంటూ అర్ధం వచ్చేలా లిరిక్స్ రాసాడు భాస్కర భట్ల. ఒక మాస్ స్టెప్ తో డాన్స్ మెప్పించాడు కిరణ్ అబ్బవరం. ఈ పాటని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం లో రూపొందిన ఈ పాట మాస్ సాంగ్స్ లిస్ట్ లో కొద్దిరోజులు ఉండబోతుందని చెప్పవచ్చు.

టాక్సీవాలా సినిమాతో పరిచయం అయిన ప్రియాంక జవాల్కర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మరో ముఖ్య మైన పాత్రలో సాయి కుమార్ నటిస్తున్నాడు. ఈ సినిమాకి మరో విశేషం ఏంటి అంటే కథ , డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఈ సినిమా హీరో కిరణ్ అబ్బవరం అందిస్తున్నాడు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్ మరియు రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీధర్ గాదె దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. థియేటర్లు తెరచుకోగానే ఈ సినిమాని విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Sigguendukura Mama Lyrical - Kiran Abbavaram | Priyanka Jawalkar | Chaitan Bharadwaj|Anurag Kulkarni

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular