fbpx
Saturday, December 28, 2024
HomeMovie Newsనేచర్ ని రక్షించే 'సింబా'- ది ఫారెస్ట్ మాన్

నేచర్ ని రక్షించే ‘సింబా’- ది ఫారెస్ట్ మాన్

Simba NewMovie Launch

టాలీవుడ్: ఒకప్పుడు ప్రయోగాత్మక సినిమాలు తక్కువగా వచ్చేవి కానీ ఇపుడు సినిమా రీచ్ పెరగడంతో ఒక దగ్గర కాకున్నా ఇంకో దగ్గర ఆదరణ లభిస్తుందని తెలుగు లో కూడా ప్రయోగాత్మక సినిమాలు వస్తున్నాయి. పాన్ ఇండియా క్యాటగిరి లో ఈ మధ్య చాలానే సినిమాలు వచాయి. ఇపుడు ‘సింబా’- ది ఫారెస్ట్ మాన్ అనే ఒక సినిమా రూపొందడానికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకి సంబందించిన కాన్సెప్ట్ టీజర్ ఒకటి యానిమేషన్ రూపంలో విడుదల చేసారు.

ఒక దట్టమైన అడవిని, చెట్లని చూపిస్తూ చివరలో ఆ చెట్లకి కొట్టేస్తూ చాలా చెట్లు కొట్టేసిన ఏరియల్ విజువల్ చూపిస్తారు. ఆ టైం లో ‘సింబా’ వచ్చి పడగొట్టిన ఒక చెట్టుని విసిరేసి ఆ చెట్లని కొట్టే వ్యక్తి పై గుచ్చి మళ్ళీ నాటడం తో ఆ చెట్టు మళ్ళీ బ్రతుకుతుంది. చివర్లో ‘ అడవులను నాశనం చేసి పచ్చదనాన్ని హరిస్తే వారికి మరణం తప్పదు అన్న ‘ లైన్ తో హీరో ని ప్రెసెంట్ చేస్తారు. ఇంచు మించు ఇలాంటి కాన్సెప్ట్ తోనే రానా ‘అరణ్య’ సినిమా రూపొందింది కానీ ఎగ్జిక్యూషన్ లోపం వల్ల సినిమా ఆకట్టుకోలేకపోయింది.

డి.రాజేందర్ రెడ్డి, డైరెక్టర్ సంపత్ నంది కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కృష్ణ సౌరభ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంపత్ నంది కథ తో మరియు మురళి మనోహర్ రెడ్డి దర్శకత్వం లో రూపొందనుంది. సినిమా నటీనటుల వివరాలు మరి కొద్దీ రోజుల్లో తెలియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular