హైదరాబాద్: భారత దేశ ప్రముఖ సినీ గేయ రచయిత అయిన శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇవాళ మరణించారు. గడచిన కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సిరివెన్నెల ఇవాళ సాయంత్రం 4:07 గంటలకు తన తుదిశ్వాస విడిచారు.
1986లో సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా తెలుగు తెరపై తన ప్రస్థానం మొదలు పెట్టారు సీతారామశాస్త్రి. తొలి చిత్రంతోనే అతని ఇంటి పేరుగా మార్చుకొని సిరివెన్నెల సీతారామశాస్త్రిగా పేరుగాంచారు. అంతేకాదు ఆ సినిమాకు గాను ఉత్తమ గేయ రచయితగా అవార్డు కూడా అందుకున్నారు. అలా మొదలైన సీతారామశాస్త్రి సినీ జర్నీలో ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి.
2019 సంవత్సరంలో ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ లభించింది. స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ పాట లిరిక్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు.