న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం మరణించారు.
శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్‌తో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీ ఎయిమ్స్ లో చివరి శ్వాస తీసుకున్నారు.
ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కు దానం చేస్తున్నట్లు తెలిపారు.
ఆయన దేహాన్ని వైద్య విద్యార్థుల అధ్యయనం మరియు పరిశోధనల కోసం ఉపయోగించాలని ఎయిమ్స్ అధికారులను అభ్యర్థించారు.
ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది.