fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsసితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫుల్ స్పీడ్‌లో.. నెలకో సినిమా

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫుల్ స్పీడ్‌లో.. నెలకో సినిమా

SITHARA-ENTERTAINMENTS-IN-PACE-ONE-MOVIE-A-MONTH
SITHARA-ENTERTAINMENTS-IN-PACE-ONE-MOVIE-A-MONTH

మూవీడెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్న నిర్మాణ సంస్థలలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒకటి.

ఇటీవల ఈ సంస్థ వరుస సినిమాలతో దూసుకుపోతూ మంచి లాభాలు ఆర్జిస్తోంది. ‘దేవర’ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో సక్సెస్‌ఫుల్‌గా డిస్ట్రిబ్యూట్ చేసి భారీగా వసూళ్లు సాధించింది.

ఇప్పుడు అదే జోష్‌లో ఈ సంస్థ వరుసగా నాలుగు సినిమాలు లైన్‌లో పెట్టింది.

మొదట వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’.

సాధారణ ఉద్యోగి జీవితంలోని డబ్బు ప్రభావం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ‘మ్యాడ్ స్కేర్’ మరో సినిమా. ‘మ్యాడ్’ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు హీరోలుగా నటిస్తున్నారు.

నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘మ్యాజిక్’ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

క్రిస్మస్ సందర్భంగా విడుదలకానున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

తదుపరి నందమూరి బాలకృష్ణ – బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక సినిమా కూడా సితార నిర్మాణంలోనే ఉండడం విశేషం.

ఇది 2025 జనవరి సంక్రాంతికి రానుంది.

ఇలా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫుల్ స్పీడ్‌లో నెలకో సినిమా రిలీజ్ చేయడం ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular