మూవీడెస్క్: సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణకు ‘బాహుబలి’ చిత్రంలోని శివగామి పాత్ర విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత ఆమె తల్లి పాత్రల్లో కీలక స్థానం సంపాదించుకుని, మంచి కథలతో సినిమాలు చేస్తోంది.
అయితే తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ది ప్యారడైజ్’లో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తారనే టాక్ వినిపించినా, అది నిజం కాదన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమాలో మోహన్ బాబు ప్రతినాయకుడిగా నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
కానీ రమ్యకృష్ణ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాదని, ఆమెతో ఎటువంటి చర్చలు జరగలేదన్నది తాజా సమాచారం.
బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆమె అందుబాటులో లేరని తెలుస్తోంది.
‘ది ప్యారడైజ్’ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తారని ముందు ప్రకటించినా, ఇప్పుడు అతడు కూడా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు కొత్త కాస్టింగ్, టెక్నీషియన్స్‌ను ఖరారు చేసే పనిలో ఉన్నారు.
మరోవైపు నాని ప్రస్తుతం ‘హిట్ 3’ షూటింగ్‌లో బిజీగా ఉండగా, ఈ సినిమా 2025 ఏప్రిల్ తర్వాత సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.