చెన్నై: ప్రస్తుతం తమిళ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అనిరుద్ కొత్త పాత ఒకటి ఇవ్వాలే విడుదల అయింది. తాను మ్యూజిక్ కంపోజ్ చేసే సినిమాలకి ఒక ప్రమోషనల్ సాంగ్ షూట్ చేసి విడుదల చెయ్యడం అనిరుద్ కి అలవాటు. అలాగే శివకార్తికేయన్ నటిస్తూ నిర్మిస్తున్న ‘డాక్టర్’ అనే సినిమాకి కూడా ఒక ప్రమోషన్ సాంగ్ చేసి విడుదల చేసారు. డైరెక్టర్ నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, హీరో శివ కార్తికేయన్ కలిసి అనిరుద్ దగ్గరికి వెళ్తారు. చాల రోజులైంది కలిసి అని అనిరుద్ మాస్క్ తీసేస్తాడు. ఇంతలో డైరెక్టర్ , హీరో అనిరుద్ కి ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్ నువ్వే , ఒక సాంగ్ చేసి ఇస్తా అన్నావ్ అని గుర్తు చేస్తారు. అనిరుద్ ఎలాంటి సాంగ్ కావాలి అంటే టిక్ టాక్ లో ట్రెండ్ అయ్యేలా ఉండాలి అని హీరో చెప్తే , టిక్ టాక్ బాన్ కదా అని అనిరుద్ వెళ్ళిపోతాడు. అపుడు టిక్ టాక్ బాన్ అనే దాని పైన్నే సాంగ్ కావాలి అనడం తో అక్కడ పాట మొదలవుతుంది.ఈ కన్వర్సెషన్ అంతా కూడా కామెడీ గా ఉంటుంది. ఈ పాటలో మాస్క్, సోషల్ డిస్టెన్స్ అవేర్నెస్ కూడా మైంటైన్ చేశారు. ఈ పాటని అనిరుద్ తో పాటు జోనిత గాంధీ కూడా ఆలపించారు.
హ్యూమరస్ గా షూట్ చేసిన ఈ ప్రమోషనల్ వీడియో కి పాట లిరిక్స్ కూడా క్యాచీ గా ఉన్నాయి. ఇంకో విశేషం ఏంటంటే ఈ పాత రాసింది కూడా హీరో శివ కార్తికేయన్. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. చాలా రోజులుగా సినిమా లవర్స్ కి ఎలాంటి మ్యూజిక్ అప్డేట్ లేకపోవడం వలన ఈ పాటని రిపీట్ మోడ్ లో పెడుతున్నారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ కి జోడీ గా తెలుగు లో నాని గ్యాంగ్ లీడర్ లో నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది.