ఆంధ్రప్రదేశ్: పులివెందుల వైసీపీ నేతల చెరలోని ఆరు కార్లు తిరిగి స్వాధీనం
పులివెందుల వైసీపీ నాయకుల చెరలో ఉన్న ఆరు కార్లను ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
2021లో సంగారెడ్డి జిల్లా హరహర రెంటల్ కార్ ట్రావెల్స్ యజమాని సతీష్ కుమార్ వికారాబాద్‌కు చెందిన మణిరాజ్‌కు ఆరు కార్లు అద్దెకిచ్చాడు. ఆ కార్లను, కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు లీజ్ తీసుకుని పులివెందులలో ఉంచి వాడుకున్నారు.
కార్లను తిరిగి ఇవ్వకుండా, అద్దె చెల్లించకుండా వేధిస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులపై గత సంవత్సరంలో సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. సతీష్‌ను ఐదు రోజుల పాటు బంధించి చిత్రహింసలు పెట్టిన అవినాష్ రెడ్డి అనుచరులు, ఆయనను చంపేందుకు ప్రయత్నించారు.
ఈ విషయంపై, ఏపీకి కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వంతో సతీష్ ఫిర్యాదు చేశాడు. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు కడప జిల్లా పోలీసులు రంగంలోకి దిగి, తెలంగాణ పోలీసులకు ఆ ఆరు కార్లను అప్పగించారు. పోలీసుల సమక్షంలో కార్లను సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.
సతీష్ కుమార్ మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వంతోనే నా కార్లు తిరిగి వచ్చాయి. వైసీపీ నేతల వల్ల నా జీవితం నాశనం అయిపొయింది. మూడు సంవత్సరాలు ఇబ్బందులలో ఉన్నా, ఇప్పుడు న్యాయం జరిగింది” అని పేర్కొన్నారు.