టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఈవెంట్‌లో తెలుగు హీరోయిన్ల గురించి చేసిన కామెంట్స్ వైరల్ కాగా, నెటిజన్లు అనేక విధాలుగా స్పందించారు. కొందరు విమర్శలు చేస్తే, మరికొందరు వైష్ణవి చైతన్యకోసం అలా అన్నారు అంటూ అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో ఎస్‌కేఎన్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. “జోక్‌ను జోక్‌లా చూడండి.. ఫంక్షన్‌లో సరదాగా చెప్పిన మాటలు వివాదంగా మారాయి. కానీ, తెలుగమ్మాయిలను ప్రోత్సహించడం గురించి చెప్పాలంటే, నేను 8-9 మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశా. నా కెరీర్‌లో 80 శాతం తెలుగు అమ్మాయిలతోనే పని చేశాను” అని వివరించారు.
ప్రస్తుతం హారికతో పాటు మరో కొత్త హీరోయిన్‌ను పరిచయం చేయబోతున్నట్టు చెప్పారు. తన తదుపరి సినిమాల్లో కూడా తెలుగు అమ్మాయిలకే ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఇక తన టీమ్‌లో ఆర్ట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రైటర్ సహా అనేక మంది తెలుగు మహిళలు ఉన్నారని వెల్లడించారు.
“నాపై తప్పుడు ప్రచారానికి తావివ్వొద్దు.. నేను ఎప్పుడూ తెలుగమ్మాయిలకే ఎక్కువ అవకాశం ఇస్తాను” అని స్పష్టం చేశారు. ఈ వివరణతో ఎస్‌కేఎన్ కామెంట్లపై కొనసాగుతున్న చర్చ ముగుస్తుందేమో చూడాలి.