తెలంగాణ: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. టన్నెల్‌లోని వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే ప్రాధాన్యతగా ఉందని అన్నారు.
ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, నేవీ, జీఎస్ఐ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. అలాగే, ఎన్జీఆర్ఐ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిపుణులు కూడా రేపటికి చేరుకుంటారని వెల్లడించారు.
ఎల్అండ్‌టీ, నవయుగ సంస్థల సాంకేతిక నిపుణులు కూడా సహాయక చర్యల్లో భాగమయ్యారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఉత్తమ్ తెలిపారు.
సహాయక చర్యలపై విమర్శలు అనవసరమని, ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రాధాన్యం అని మంత్రి స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రమాదాలపై తాము రాజకీయాలు చేయలేదని గుర్తుచేశారు.