టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ, నాగ చైతన్య పెళ్లి వార్త ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 4న వీరిద్దరూ సింపుల్ మ్యారేజ్ చేసుకుని ఒక్కటయ్యారు. కానీ ఇప్పుడు పెళ్లైన రెండు నెలలకే శోభిత తీసుకున్న కొత్త నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కెరీర్ పరంగా పూర్తిగా మారిపోయేలా ఉన్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు బోల్డ్, గ్లామర్ రోల్స్‌లో కనిపించిన శోభిత, ఇప్పుడు సంప్రదాయమైన పాత్రలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన తండేల్ సక్సెస్ మీట్‌లో ఆమె సంప్రదాయ చీరకట్టుతో కనిపించడంతో ఈ మార్పు మరింత స్పష్టమైంది. హిందీ వెబ్‌సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ ద్వారా గ్లామర్ యాంగిల్‌కు ఫోకస్ తెచ్చుకున్న శోభిత, ఇప్పుడు పూర్తి భిన్నమైన దిశలో సాగాలని భావిస్తోంది.
ఈ మార్పుకు కారణం అక్కినేని ఫ్యామిలీ అని భావిస్తున్నారు. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్ తగ్గించి, నటనకు ప్రాధాన్యం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీకి వచ్చిన హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ షో చేయకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంతో శోభిత కూడా తన కెరీర్‌ను మరో కోణంలో కొనసాగించనుంది.
అయితే, ఈ నిర్ణయం ఆమె సినిమాల ఎంపికపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఆమె ప్రాజెక్టులపై స్పష్టత లేదు కానీ, కంటెంట్ బేస్డ్ మూవీస్‌పై ఎక్కువ దృష్టి పెట్టనుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ మార్పు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.