టాలీవుడ్: సూపర్ స్టార్ కృష్ణ ఫామిలీ నుండి వచ్చిన మరో నటుడు సుధీర్ బాబు. సుధీర్ బాబు హీరో గా ప్రస్తుతం ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే సినిమా రూపొందుతుంది. కరోనా కన్నా కొంచెం ముందు ఫిబ్రవరి 2020 లో విడుదలైన పలాస 1978 సినిమాని రూపొందించి హిట్ కొట్టిన దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఒక గోదావరి తీరప్రాంత విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ సినిమాగా పల్లె వాతావరణం లో రూపొందుతుంది. సినిమా టైటిల్ లో ఉన్న శ్రీదేవి పాత్రని ‘ఆనంది’ పోషిస్తుంది. ఆనంది కి సంబందించిన ఫస్ట్ లుక్ తో పాటు చిన్న టీజర్ విడుదల చేసింది సినిమా టీం.
శ్రీదేవి సోడా సెంటర్ షాప్ లో సోడాలు అమ్ముతూ ఉండే ఆనంది ఈ వీడియో లో చూపించారు. చలాకి గా ఉంటూనే ఎవరైనా తనతో తింగరి వేషాలు వేస్తా వాడి తాట తీసే పాత్రలో ఆనంది ఈ సినిమాలో నటించింది. ‘ఇదివరకు ఒకసారి సోడా సోడా అంటూ వూరికే ఇక్కడికి రావడం తో వాడి పైన సోడా పగల గొట్టా.. అప్పటినుండి సోడాల శ్రీదేవి అని పిలుస్తారు’ అని టైటిల్ జస్టిఫికేషన్ ఉన్న వీడియో విడుదల చేసారు. బ్యాక్ గ్రౌండ్ లో మణి శర్మ మ్యూజిక్ ఆకట్టుకుందని చెప్పవచ్చు. సుధీర్ బాబు కూడా ఈ సినిమా కోసం స్పెషల్ గా బాడీ మేకర్ ఓవర్ చేసుకుని కష్టపడుతున్నాడు. 70 MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చల్లా, శశి దేవి రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెలుగు అమ్మాయే అయినప్పటికీ తమిళ సినిమా ద్వారా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ఆనంది ఇప్పుడిప్పుడే తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటుంది.