టాలీవుడ్: దాదాపు 9 నెలలపాటు థియేటర్లు మూతపడి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరచుకొమ్మని ప్రభుత్వం నుండి అనుమతులు లభించాయి. కానీ థియేటర్లు తెరచుకున్నా కూడా జనాలని థియేటర్లకు తీసుకొచ్చే సినిమాలు ఇంకా విడుదల తేదీలు ప్రకటించలేదు. కానీ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం రిస్క్ చేసి తన సినిమా తోనే జనాలని థియేటర్లకు తీసుకు రావడానికి శ్రీకారం చూట్టాడు. తాను తీసిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ సినిమా ఓటీటీ లో విడుదలవుతుంది అని రూమర్స్ వచ్చినప్పటికీ ఈ సినిమాని జీ ఎంటర్టైన్మెంట్ వాల్లు కొన్నప్పటికీ అది థియేటర్ విడుదల తర్వాత ఓటీటీల్లో విడుదల అన్న విషయం తర్వాత తెలిసింది.
ఇప్పటివరకు రామ్ గోపాల్ వర్మ ‘కరోనా’ ఒక్కటే విడుదల తేదీ ప్రకటించింది. అలాంటిది సాయి ధరమ్ తేజ్ తన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ద్వారా జనాలని థియేటర్ లకి రప్పించుకోవడానికి ఇదే మంచి సమయం అని భావించారు. ఎవరో ఒకరు మొదలు పెట్టాలి కాబట్టి తనతోనే ఆ ప్రయాణం ప్రారంభించారు. ఒక రకంగా చెప్పుకుంటే ఇదే మంచి తరుణం. ఒక వేల జనాలు థియేటర్లకు రెగ్యులర్ గా వచ్చినట్లు వస్తే ఇంకా లైన్ లో ఉన్న సినిమాలు అన్ని విడుదల అవుతాయి. అదీ కాకుండా వెంటనే సంక్రాతి ఉండడం తో ఇపుడిపుడే రిలీజ్ డేట్స్ కూడా ఖాళీ దొరకవు. ఒక రకంగా చూసుకుంటే సాయి తేజ్ కి కొన్ని రకాలుగా కలిసొచ్చే విషయం కొన్ని రకాలుగా రిస్క్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎస్వీసిసి బ్యానర్ పై బివీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించాడు. సుబ్బు అనే నూతన దర్శకుడి నేతృత్వం లో ఈ సినిమా రూపొందింది. థమన్ ఈ సినిమాకి ఆంచించిన పాటలు విడుదలై హిట్ గా నిలిచాయి. ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.