హైదరాబాద్: కరోనా వల్ల అయిదు నెలల నుండి అన్ని రంగాలు ఎక్కడివి అక్కడే కుదేలైపోయాయి. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే మెల్లిగా అన్ని రంగాల్లో పునరుద్ధరణ జరుగుతుంది. అదే బాటలో సినిమా వాల్లు కూడా షూటింగ్స్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. కరోనా తగ్గినప్పటికీ పరిస్థితులు ఇప్పుడప్పుడే మారవు అని అర్ధం అయ్యి కరోనా తో జీవించాల్సిందే కాబట్టి కొవిడ్ నిబంధనల్ని అనుసరిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ కొందరు హీరోలు షూటింగ్స్ మొదలుపెడుతున్నారు.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ సినిమాతో సుబ్బు అనే కొత్త డైరెక్టర్ పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ఒక పాట తాలూకు షూటింగ్ ని శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ లో ప్రారంభించారు ఈ సినిమా టీం. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో పాటు ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ ‘నభా నటేష్’ నటిస్తుంది. ఈ సినిమా నుండి విదులైన టీజర్ బాగానే ఆకట్టుకుంది. దాదాపు షూటింగ్ అయిపోయిన ఈ సినిమా మిగిలిన కొంత భాగం పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధం చేసే పనిలో ఉన్నారు మేకర్స్. సెప్టెంబర్ చివరి కల్లా థియేటర్లు ఓపెన్ చేస్తే మొదట విడుదలయ్యే సినిమాల్లో ఈ సినిమాని ఉంచే ఉదేశ్యం తో సినిమా షూటింగ్ ముగించే పని పూర్తిచేస్తున్నారు సినిమా టీం. ఎస్వీసిసి బ్యానర్ పై భోగవల్లి ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు హిట్ గా నిలిచాయి.