ఢిల్లీ: కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీపై బీజేపీ సభ్యులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ప్రతిపాదించడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై సోనియా చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
రాష్ట్రపతి ప్రసంగాన్ని చదవడానికి ముర్ము తిప్పలు పడినట్టుగా ఆమె వ్యాఖ్యానించడం అధికార పార్టీ నేతలకు ఆగ్రహాన్ని కలిగించింది.
సోనియా వ్యాఖ్యలపై తొలుత రాష్ట్రపతి భవన్ అధికారికంగా స్పందించగా, తాజాగా 40 మంది బీజేపీ ఎంపీలు ఆమెపై రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.
సోనియా గాంధీ, ఒక రాజ్యసభ సభ్యురాలిగా రాష్ట్రపతి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వహించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివాదం కాంగ్రెస్ పార్టీకి మరో చిక్కుగా మారింది. రాహుల్ గాంధీ కూడా ఇదే అంశంపై ‘బోరింగ్’ అన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, అనంతరం వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే సోనియా గాంధీపై అధికారపక్షం నడిపిస్తున్న ఈ దూకుడు రాజ్యసభలో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.