న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుదల నమోదు చేస్తోంది. తాజాగా భారత జాతీయ కాంగ్రెస్ అధినేత్రి అయిన సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ గా తేలింది.
ఇవాళ గురువారం వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో సోనియాకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె ఇప్పుడు ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యే ముందు సోనియా కరోనా వైరస్ బారిన పడ్డారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా సోనియా గాంధీ ఈనెల 8వ తేదీన ఈడీ ఎదుట హాజరు అవ్వాల్సి ఉంది. ఇక, ఇటీవల సోనియాతో సమావేశమైన నేతలకు కూడా కరోనా సోకినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది.