టాలీవుడ్: టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో ప్రముఖ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నటుడిగా సోనూ సూద్ కి మంచి పేరుంది. కానీ అంత కన్నా తనకి పెద్ద మనసుందని ఈ మధ్య సోనూ సూద్ చేసే సేవా కార్యక్రమాలు చూస్తే అర్ధం అవుతుంది. కరోనా లొక్డౌన్ సమయంలో వలస కార్మికుల్ని అందరూ వదిలేసినా కూడా తన సొంత డబ్బులతో వాళ్ళని తమ సొంత ప్రదేశాలకి వెళ్లే ఏర్పాటు చేసాడు. అంతటితో ఆగకుండా తన వద్దకి వచ్చిన ప్రతి కష్టానికి మార్గం చూపెడుతున్నాడు. దీనిపై సొంత లాభాల కోసం ఇదంతా చేస్తున్నాడు అని విమర్శలు వచ్చిన కూడా సున్నితంగా తిరస్కరించి తన పని తాను చేసుకుంటున్నాడు.
మొన్న ఒక రైతు తన బిడ్డ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం స్మార్ట్ ఫోన్ కొనాలని తన జీవనాధారం అయిన పాలు ఇచ్చే గేదెని అమ్మితే, ఆ విషయం తెలుసుకున్న సోనూ సూద్ వెంటనే చలించి వారి వివరాలు తెలుసుకొని వాళ్ళకి సాయం చేసే ఏర్పాట్లు చేసాడు. నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఒక రైతు తనకి పొలం దున్నడానికి ఎద్దులు లేకపోతే తన కూతుళ్లతో కలిసి నాగలి దున్నుతున్న వీడియో సోనూ సూద్ వద్దకి చేరింది. దీనికి చలించిన సోనూ సూద్ ఆ మరునాడే ఉదయమే వాళ్ళ ఇంటికి ట్రాక్టర్ పంపించారు. అలాగే ఆ రైతు కూతుళ్లను చదివించే భాద్యత కూడా తీసుకున్నాడు. సోనూ సూద్ సమాజ సేవ కార్యక్రమాలు చూసి చాలా మంది మెచ్చుకుంటున్నారు. కానీ ఆ మెచ్చుకునే వాళ్లలో ఇంకొంచం మంది కూడా సోనూ సూద్ బాటలో నడిచి ఇంకొందరికి సాయం చేస్తే మానవత్వం వికసించి బావి తరాలకి మంచి ఫలాలని ఇస్తుంది.