మూవీడెస్క్: సినిమాల్లో విలన్ అయినా, నిజజీవితంలో రియల్ హీరోగా నిలిచిన సోనూ సూద్ పేరు ఇప్పుడు ఓ వివాదంలో ముడిపడింది.
లూథియానా కోర్టు తాజాగా ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం పెద్ద చర్చకు దారి తీసింది.
కరోనా సమయంలో వలస కార్మికులకు సహాయం చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సోనూ, ఇప్పుడు అక్రమ కేసులో ఇరికించబడ్డాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
కోర్టు న్యాయవాది రాజేష్ ఖన్నా ఫిర్యాదు మేరకు క్రిప్టోకరెన్సీ మోసం కేసులో సోనూ సూద్‌ను విచారించేందుకు సమన్లు జారీ చేసింది.
అయితే, కోర్టుకు హాజరుకాలేదనే కారణంగా అరెస్ట్ వారెంట్ ఇచ్చింది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, వెంటనే సోనూ స్పందిస్తూ తనకు కేసుతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
‘‘నా పేరు అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారు. నిజానికి ఇది మూడో వ్యక్తికి సంబంధించిన కేసు.
నా న్యాయవాదులు ఇప్పటికే దీనిపై స్పందించారు’’ అంటూ స్పష్టత ఇచ్చారు.
నెటిజన్లు కూడా సోనూ సూద్‌ను మద్దతుగా నిలుస్తూ, ‘‘ఇలాంటి ఆరోపణలు ఆయన ప్రతిష్టను దెబ్బతీయలేవు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం సోనూ పలు సినిమాల్లో నటిస్తుండగా, ఈ వివాదం అతని కెరీర్‌పై పెద్దగా ప్రభావం చూపదని పరిశీలకులు భావిస్తున్నారు.
మరి, ఈ కేసు ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.