ముంబై: సోనూసూద్ – ఈ పేరు వినగానే తెలుగులో చేసిన చాలా ప్రతినాయకుడి పాత్రలే గుర్తుకువస్తాయి, ముఖ్యంగా చెప్పాలంటే అరుంధతి లో చేసిన పశుపతి పాత్ర. ఆ క్యారెక్టర్ లో ఇంకెవ్వరని వూహించుకోనంతగా నటించాడు. తాను గొప్ప నటుడే కాదు అంత కన్నా గొప్ప మనసున్న వాడు అని కరోనా సంక్షోభం లో తాను చేసిన పనులే చెప్తున్నాయి. కరోనా సమయంలో బతుకుదెరువు కోసం వెళ్లి ఎక్కడెక్కడో చిక్కుకొని సొంత ఊళ్ళకి వెళ్లే పరిస్థితిలో లేని ఎంతో మంది వలస కార్మికులకు తన సొంత డబ్బు తో వాళ్ళని సొంత ఊళ్ళకి చేర్చే బాధ్యత తీసుకున్నాడు. ఇదంతా రాజకీయాల్లో రావడం కోసం చేస్తున్న హంగామా అని విమర్శలు చేసినా కూడా ‘విమర్శలు చాల మంది చేస్తారు , వాళ్ళు ఆలా చేస్తున్నారు అంటే మనం ఒక మెట్టు ఎదిగినట్టే. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి’ అని చాలా సున్నితంగా బదులిచ్చారు.
ఇదిలా ఉండగా తన పై ఉన్న అభిమానాన్ని అస్సోమ్ కి చెందిన రణ్‌బీర్ అనే చిత్రకారుడు వలస కార్మికుల జీవన స్థితిగతులను ఉద్ధేశిస్తూ సోనూసూద్ రూపం వచ్చేలా ఒక చిత్రాన్ని గీసి ట్విట్టర్ లో షేర్ చేశారు. అది చూసిన సోనూ సూద్ ఆనందం తో ముగ్దుడైపోయి తన పైన ఇంత అద్భుతమైన స్కెచ్ ఇంత కళాత్మకంగా గీసిన అద్భుతమైన కళాకారున్ని కలవాలని పోస్ట్ పెట్టి ఆ చిత్రాలని షేర్ చేసారు. దీనితో పాటు సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలకి చాలా మంది తారలు , సామాన్య ప్రజలు తమ సపోర్ట్ తెలియచేస్తున్నారు.