ఖమ్మం: సీనియర్ నటి సౌందర్య మరణం గురించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆమె హత్యకు గురయ్యారని, ప్రమాదవశాత్తు మరణం కాదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో నటుడు మోహన్ బాబుపై కూడా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడ్డాయి.
ఈ ఆరోపణలపై సౌందర్య భర్త రఘు తొలిసారి స్పందించారు. 2004లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం విషయంలో అనవసరమైన అనుమానాలు పెంచడం సరికాదని అన్నారు. మోహన్ బాబు తమ కుటుంబానికి ఎప్పుడూ మంచి మిత్రుడని, ఆయనపై అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని ప్రాపర్టీ విషయంలో తప్పుడు కథనాలు వస్తున్నాయని రఘు ఖండించారు. మోహన్ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని అన్నారు.
ఆరోపణలు చేసే ముందు నిజాలు తెలుసుకోవాలని, నిరాధారమైన ప్రచారాలు మానుకోవాలని రఘు ప్రజలను కోరారు. గతంలోనే ఈ కేసుపై వివిధ విచారణలు జరిగాయని, సౌందర్య మరణం ప్రమాదవశాత్తే అని స్పష్టం చేశారు.