డర్బన్: South Africa vs Pakistan: మూడేళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న జార్జ్ లిండే, కింగ్స్‌మీడ్ స్టేడియంలో తన అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాకు విజయం అందించాడు.
బ్యాట్‌తో 24 బంతుల్లో 48 పరుగులు చేయడమే కాకుండా, బౌలింగ్‌లో 4/21 తీసుకొని తన ప్రత్యేకతను చాటాడు.
19వ ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించాడనుకుంటే రివ్యూ కారణంగా ఆ అవకాశాన్ని కోల్పోయినా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతనికి లభించింది.
డేవిడ్ మిల్లర్ జోరు
దక్షిణాఫ్రికా బలహీన జట్టుతో బరిలోకి దిగినా, డేవిడ్ మిల్లర్ తన శక్తివంతమైన ఆటతీరుతో పాకిస్తాన్‌పై పైచేయి సాధించాడు.
40 బంతుల్లో 82 పరుగులు చేసిన మిల్లర్, జట్టును గౌరవప్రదమైన స్థితికి తీసుకెళ్లాడు.
షాహీన్ ఆఫ్రిదీ, అబ్రార్ అహ్మద్ మొదటి ఓవర్లలోనే వికెట్లు పడగొట్టినా, మిల్లర్ ఒంటరిపోరాటంతో స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు.
అతని ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికా స్కోరును ముందుకు నడిపింది.
లిండే ఫినిషింగ్ టచ్
మిల్లర్ ఔటైన తర్వాత పాకిస్తాన్ బౌలర్లు మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నట్లు అనింపించింది. అయితే, లిండే చివరి ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టి దక్షిణాఫ్రికా స్కోరును 183కి తీసుకెళ్లాడు.
పాకిస్తాన్ చివరి ఓవర్లలో బౌలింగ్ వైఫల్యం వల్ల ఈ పెద్ద లక్ష్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.
పాకిస్తాన్ పోరాటం
మహమ్మద్ రిజ్వాన్ చివరి వరకూ పోరాడినా, మొదటి 44 బంతుల్లో నెమ్మదిగా ఆడటం వల్ల జట్టుకు నష్టమైంది.
సైమ్ అయుబ్ శుభారంభం ఇచ్చి 31 పరుగులు చేసినప్పటికీ, మిడిల్ ఆర్డర్ బలహీనతతో జట్టు వెనుకబడి పోయింది.
క్వినా మాఫకా 17వ ఓవర్లో 24 పరుగులు ఇచ్చి మ్యాచ్‌పై ఉత్కంఠ పెంచినా, చివరి ఓవర్లో అతడే రిజ్వాన్‌ను ఔట్ చేసి దక్షిణాఫ్రికా విజయాన్ని ఖరారు చేశాడు.
ఈ విజయం, రెండో శ్రేణి జట్టుతో దక్షిణాఫ్రికా సాధించిందని చెప్పుకోవచ్చు.