శివమొగ్గ: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ తరువాత మళ్ళీ పలు దేశాల్లో కొత్త వేరియంట్స్ పుట్టుకొచ్చి తిరిగి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్ కేసు ఒకటి కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా కేంద్రంలో బయటపడింది.
గత కొద్ది రోజుల క్రితం దుబాయ్ నుంచి బెంగళూరులో విమానం దిగి అక్కడి నుంచి శివమొగ్గకు వెళ్లిన ఒక వ్యక్తికి (53)కు కొత్త కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. శివమొగ్గలో తన ఇంట్లో వారంరోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న తరువాత అతను బయటకు వచ్చి తిరిగాడు.
అతను అనుమానం వచ్చి అతను మరోసారి కోవిడ్ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. కాగా ఇది కొత్త రకం కరోనా ఏమో అని పరీక్షించగా దక్షిణాఫ్రికాలో ఇటీవల గుర్తించిన స్ట్రెయిన్‌గా తేలింది. అయితే ఆ బాధితుడికి జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా వైద్యమందిస్తున్నారు.
ఇదిలా ఉండగా భారత్‌లో గడిచిన 24 గంటల్లో 23,285 కరోనా పాజిటివ్ కేసులు మరియు 117 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కోవివ్ కేసుల సంఖ్య 1,13,08,846కు చేరుకుందని భారత కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. యాక్టివ్ కేసులు సంఖ్య 1,97,237గా ఉంది. రికవరీ రేటు 96.86గా నమోదయింది.